- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ టెట్ ఫలితాలు రేపే.. మార్కులు, క్వాలిఫైయింగ్ కట్-ఆఫ్ వివరాలు ఇవే
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) రాసిన అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్డేడేట్ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) రాసిన అభ్యర్థులకు బిగ్ అలర్ట్. రేపు (సోమవారం) మధ్యాహ్నం 02:30 గంటలకు టెట్ ఫలితాలు విడుదల అవుతాయని సమాచారం. ఫలితాలు విడుదలైన వెంటనే అభ్యర్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా సులభంగా మార్కులను చూసుకోవచ్చు. అభ్యర్థుల సౌకర్యార్థం విద్యాశాఖ ప్రత్యేకంగా అధికారిక పోర్టలు అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ సహాయంతో అధికారిక వెబ్సైట్ https://tgtet.aptonline.in లో లాగిన్ అయి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 115,028 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.
కేటగిరీల వారీగా క్వాలిఫైయింగ్ మార్కులు..
OC అభ్యర్థులు: కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. అంటే 150 మార్కులకు గానూ 90 మార్కులు రావలసి ఉంటుంది.
BC అభ్యర్థులు: కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. అంటే 75 మార్కులు వస్తేనే అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు: కనీసం 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. అంటే 150 మార్కులకు గానూ 60 మార్కులు సాధిస్తే సరిపోతుంది.
టెట్‌లో సాధించిన మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో (DSC) 20 శాతం వెయిటేజీ ఉంటుంది. ఉపాధ్యాయ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు టెట్ మార్కులు అత్యంత కీలకం. ఈ టైట్‌లో సాధించిన మార్కులకు రాబోయే ఉపాధ్యాయ నియామకాల్లో (DSC) 20 శాతం వెయిటేజీ ఉంటుంది. కాబట్టి ఇందులో మంచి స్కోర్ సాధించడం అభ్యర్థుల ఉద్యోగ అవకాశాలను మరింత మెరుగుపరుస్తుంది.






