- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలి
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను విజయవంతం చేయడం పార్టీ శ్రేణుల బాధ్యత అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, ఆత్మకూర్ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను విజయవంతం చేయడం పార్టీ శ్రేణుల బాధ్యత అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హనుమకొండ భవానీనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జిలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మండలాల వారీగా ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన డేటాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రజలకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన కల్పిస్తూ, అర్హులైన ఓటర్లు అవసరమైన దరఖాస్తులను గడువులోగా సమర్పించేలా సహకరించాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, ఒక్క అర్హుడూ ఓటరు జాబితాకు దూరం కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, సమన్వయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






