సదాశివపేట బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

by Taduka Kalyani |

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని జాతీయ రహదారి-65 బైపాస్ వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

సదాశివపేట బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
X

దిశ, సదాశివపేట: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని జాతీయ రహదారి-65 బైపాస్ వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివపేట నుంచి సంగారెడ్డి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కిష్టారెడ్డి (59)ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు ఆయన తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు జంగారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story