- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ వస్తే లాగులు తడుపుకుంటారు: ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
మేడిగడ్డపై సీఎం మూర్ఖత్వపు ప్రచారం చేస్తున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కాళేశ్వరం ద్వారా గొప్ప అవకాశం సృష్టించారని అన్నారు. ...

దిశ, తెలంగాణ బ్యూరో: మేడిగడ్డపై సీఎం మూర్ఖత్వపు ప్రచారం చేస్తున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కాళేశ్వరం ద్వారా గొప్ప అవకాశం సృష్టించారని అన్నారు. షాబాద్ సైకో ఘటనకు, సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలకు తేడా లేదని అన్నారు. రిటైర్డ్ ఇంజినీర్లను జైల్లో పెడతానని సీఎం బెదిరిస్తున్నారని.. వారు తెలంగాణవాదులుగా మాత్రమే మాట్లాడుతున్నారని చెప్పారు. వాస్తవాలు మాట్లాడితే బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తారా అని.. జైల్లో పెట్టిన వాళ్లు కాలగర్భంలో కలిశారని సూచించారు. సూపర్ ఎల్‌నినోతో మంచి నీళ్లకు ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుందన్నారు. బీఆర్ఎస్ నేతల రక్తాన్ని పొలాల్లో చల్లుతానని రేవంత్‌రెడ్డి అన్నారని.. కేసీఆర్ రక్తం చెమటగా మారి తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. రేవంత్‌రెడ్డికి తమ రక్తం కావాలంటే కేటీఆర్‌తో సహా అందరం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి తెలంగాణ ద్రోహుల చేతిలో ఆయుధంగా ఉన్నారని.. ఆయనది రాక్షస మనస్తత్వమని.. ఇలాంటి వ్యాఖ్యలపై ఎలాంటి కేసులు పెట్టాలో డీజీపీ ఆలోచించాలని అన్నారు. భద్రాచలం కొట్టుకుపోతుందని అజ్ఞానపు సీఎం, మంత్రి అంటున్నారని.. దీనిపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మంత్రికి ఏ మూర్ఖుడు చెప్పిండో తెలియదని.. 290 టీఎంసీల వరద వచ్చినా భద్రాచలానికి ఏం కాలేదని అన్నారు. సీఎం పదవి పిచ్చిలో పడి ఆయనకు జ్ఞాపక శక్తి తగ్గిందన్నారు. వీళ్లకు అసెంబ్లీ పెట్టే దమ్ము లేదని.. కేసీఆర్ వస్తే లాగులు తడుపుకుంటారని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని.. రాష్ట్రంలో ఉన్నది హైబ్రిడ్ కాంగ్రెస్ అని పేర్కొన్నారు.






