- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AI Education: డిగ్రీ కోర్సుల్లో ఏఐ తప్పనిసరి?
ఏఐ వినియోగం అన్ని రంగాలకు విస్తరిస్తుండటంతో, కేవలం సంప్రదాయ డిగ్రీతో ఉద్యోగాలు పొందడం కష్టమవుతోందని, విద్యార్థులు ఏఐ ఆధారిత నైపుణ్యాలను తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఉద్యోగాల స్వరూపం వేగంగా మారుతున్న నేపథ్యంలో, అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు చోటు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం నాస్కామ్‌తో కలిసి కొత్త పాఠ్యప్రణాళికను రూపొందిస్తోంది. ఈ విషయాన్ని నాస్కామ్ అధ్యక్షుడు రాజేష్ నంబియార్ వెల్లడించారు. ఏఐ వినియోగం అన్ని రంగాలకు విస్తరిస్తుండటంతో, కేవలం సంప్రదాయ డిగ్రీతో ఉద్యోగాలు పొందడం కష్టమవుతోందని, విద్యార్థులు ఏఐ ఆధారిత నైపుణ్యాలను తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కొత్త సిలబస్‌కు ఏఐసీటీఈ, యూజీసీ వంటి నియంత్రణ సంస్థల ఆమోదం అవసరం ఉండటంతో ఈ ప్రక్రియ పూర్తవడానికి సుమారు ఆరు నెలలు పట్టే అవకాశం ఉందన్నారు. గతేడాది మూడో తరగతి నుంచే పాఠశాలల్లో ఏఐ పాఠ్యాంశాలను ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటించగా, ఇప్పుడు అదే దిశగా ఉన్నత విద్యలోనూ కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. దీంతో రాబోయే రోజుల్లో డిగ్రీ కోర్సులు ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మరింత నైపుణ్యాధారితంగా మారనున్నాయి.






