- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆ విమానాన్ని పేల్చేస్తాం’.. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
by Ramesh Naini |
రియాద్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ అంతర్జాతీయ విమానాన్ని గగనతలంలోనే పేల్చేస్తామంటూ శంషాబాద్ విమానాశ్రయానికి ఆదివారం ఓ ఫేక్ బాంబు బెదిరింపు వచ్చింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రియాద్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ అంతర్జాతీయ విమానాన్ని గగనతలంలోనే పేల్చేస్తామంటూ శంషాబాద్ విమానాశ్రయానికి ఆదివారం ఓ ఫేక్ బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్‌పోర్ట్ కస్టమర్ సపోర్ట్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ-మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విమానం శంషాబాద్‌లో ల్యాండ్ కాగానే భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారణ కావడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానాశ్రయ అధికారుల (GHIAL) ఫిర్యాదు మేరకు ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






