- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటిజంపై అవగాహనే తొలి చికిత్స.. రెయిన్‌బో హాస్పిటల్లో అంతర్జాతీయ సదస్సు
రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఆటిజం ఒడిస్సీ 3.0 అంతర్జాతీయ సదస్సు ఆదివారం ముగిసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఆటిజం ఒడిస్సీ 3.0 అంతర్జాతీయ సదస్సు ఆదివారం ముగిసింది. ఆటిజం అనేది కేవలం బాల్యానికి మాత్రమే పరిమితం కాదని, అది జీవితాంతం ఉండే పరిస్థితి అని, దీనిపై సమాజంలో మరింత అవగాహన పెరగాలని నిపుణులు పిలుపునిచ్చారు. ఆటిజం ఉన్న వారికి విద్య, ఉపాధి, వృద్ధాప్య దశల్లో బలమైన వ్యవస్థలు అవసరమని, ఇందుకోసం వైద్యులు, విద్యావేత్తలు, విధాన రూపకర్తలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని వక్తలు సూచించారు.
అంతర్జాతీయ ఆటిజం కార్యకర్త డాక్టర్ టెంపుల్ గ్రాండిన్ ముఖ్య అతిథిగా పాల్గొని.. ఆటిజం ఉన్న వ్యక్తులలోని ప్రత్యేక ప్రతిభను గుర్తించి, వారికి స్వతంత్రమైన అవకాశాలను కల్పించాలని కోరారు. పిల్లల్లో ఆటిజం లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని, శిశువైద్యులు స్క్రీనింగ్‌పై దృష్టి పెట్టాలని డాక్టర్ ప్రతిమ గిరి, డాక్టర్ కోణకి రమేష్ అభిప్రాయపడ్డారు. అలీ యావర్ జంగ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సహకారంతో జరిగిన ఈ సదస్సులో దాదాపు 500 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆటిజం చికిత్సలో భవిష్యత్తు కుటుంబ-కేంద్రీకృత వ్యవస్థల వైపు సాగాలని నిపుణులు తీర్మానించారు. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో అందుబాటులో ఉన్న సమగ్ర సంరక్షణ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.






