- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
by Kodari Anjali |
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట బస్టాండ్ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో బస్సు పాక్షికంగా ముందు భాగం దెబ్బతిన్నది.

X
దిశ, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట బస్టాండ్ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో బస్సు పాక్షికంగా ముందు భాగం దెబ్బతిన్న ఘటన ఎల్లారెడ్డిపేటలో చోటుచేసుకుంది. దీంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడ నుండి బస్ కామారెడ్డికి వెళ్తుండగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సెకండ్ బైపాస్ రోడ్డు వద్దకు రాగానే కుడివైపు ఉన్న డివైడర్‌ను ఢీకొనడంతో ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. అందులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఒకసారిగా బ్రేక్ వేయడంతో భారీ శబ్దం వచ్చింది. దీంతో ప్రయాణికులు ఉలిక్కిపడగా.. కొందరికి స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే బస్‌ను పక్కకు ఆపి డిపోకు డ్రైవర్ సమాచారం అందించారు.
Next Story






