- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరీక్షణకు తెర.. ‘ట్రైన్’ సినిమా టీజర్‌తో పాటు రిలీజ్‌పై హింట్ ఇచ్చిన మూవీ మేకర్స్
పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ విషయంపై హింట్ ఇస్తూ.. మూవీ మేకర్స్ తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు.

దిశ, సినిమా: విజయ్ సేతుపతి, శృతి హాసన్, నరైన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘ట్రైన్’. దర్శకుడు మిస్కిన్ దర్శకత్వంలో రాబోతుండగా.. 2023లో ప్రారంభమై గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకుంది. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ విషయంపై హింట్ ఇస్తూ.. మూవీ మేకర్స్ తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. కదులుతున్న రైలులో సాయుధ బలగాలతో విజయ్ సేతుపతి ఒంటరిగా పోరాడుతున్న సీన్స్ చూస్తుంటే.. ఇది ఒక ఉత్కంఠభరితమైన బంధీల విముక్తి కథాంశంతో వస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ టీజర్‌లో శృతి హాసన్ చేతిలో తుపాకీ పట్టుకుని కనిపించడం, మరో సీన్లో ఒక మహిళ విజయ్ సేతుపతికి గన్ పాయింట్ పెట్టడం చూస్తుంటే.. సినిమాలో శృతి హాసన్ విలన్ పాత్రలో నటిస్తోందా అనే ఆసక్తి నెటిజన్లలో పెరిగింది. దర్శకుడు మిస్సిన్ స్వయంగా ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం. కలైపులి ఎస్. థాను నిర్మించిన ఈ చిత్రంలో నాజర్, కేఎస్ రవికుమార్, సంపత్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.






