- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తుతెలియని మహిళ మృతి
by Taduka Kalyani |
గుర్తుతెలియని మహిళ మృతి చెందిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

X
దిశ, చైతన్యపురి : గుర్తుతెలియని మహిళ మృతి చెందిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్ పెక్టర్ కె. వినోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. డిఫెన్స్ కాలనీ సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద ఒక మహిళ (40) అపస్మారక స్థితిలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే బీట్ కానిస్టేబుల్స్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి 108 కాల్ చేశారు. వైద్య సిబ్బంది పరీక్షించి మృతిచెందినట్లు నిర్దారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. ఎవరికైనా మహిళ ఆచూకీ తెలిస్తే తమను సంప్రదించాలని ఆయన సూచించారు.
Next Story






