- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సామేల్-చామల వర్గాల బలప్రదర్శన..! కాంగ్రెస్‌లో తుంగతుర్తి వివాదంపై కీలక సమావేశాలు
తుంగతుర్తి నియోజకవర్గంలో నేతల మధ్య నెలకొన్న వివాదాలు, విభేదాలపైన టీపీసీసీ పరిశీలకుడిగా నియమితులైన టీపీసీసీ వర్కింగ్ కమిటీ జగ్గారెడ్డి రెండు రోజులుగా సంబంధిత నేతలతో గాంధీభవన్‌లో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తుంగతుర్తి నియోజకవర్గంలో నేతల మధ్య నెలకొన్న వివాదాలు, విభేదాలపైన టీపీసీసీ పరిశీలకుడిగా నియమితులైన టీపీసీసీ వర్కింగ్ కమిటీ జగ్గారెడ్డి రెండు రోజులుగా సంబంధిత నేతలతో గాంధీభవన్‌లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. శనివారం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సూర్యాపేట డీసీసీ చీఫ్ గుడిపాటి నర్సయ్య, ఇతర నేతలతో జగ్గారెడ్డి సమావేశం అయ్యారు. అక్కడ నెలకొన్న సమస్యపైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఎమ్మెల్యే సామేల్ మండలాల్లో నియమించిన మండలాధ్యక్షుల నియామకమే వివాదానికి కారణమని తెలిపినట్లుగా పార్టీ నేతలు తెలిపారు. ఈ క్రమంలో గాంధీభవన్ మెట్ల దగ్గర ఎంపీ చామల వర్గీయులు అక్కడ నినాదాలు చేస్తూ బైఠాయించారు. సేవ్ కాంగ్రెస్ అంటూ స్లొగన్స్ ఇస్తూ బల ప్రదర్శనకు దిగారు. కాగా, ఆదివారం నాడు జగ్గారెడ్డి స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ తో గాంధీభవన్ లో భేటీ అయ్యారు. సామేల్ తో పాటు నియోజకవర్గంలోని తొమ్మిది మండలాలు తుంగతుర్తి, తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, శాలిగౌరారం, మోత్కూరు, అడ్డగూడూర్, నూతనకల్లు, మద్దిరాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాంధీభవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా సామేల్ కి మద్దతుగా ఆయన వర్గీయులు పెద్ద ఎత్తున గాంధీభవన్ దగ్గర నినాదాలు చేశారు.
సామేల్ నాయకత్వం వర్ధిల్లాలి..
సామేల్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ స్లొగన్స్ ఇచ్చారు. మరోవైపు గాంధీభవన్ దగ్గర సామేల్ వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫోటో కూడా పెట్టడం చర్చనీయాంశంగా మారింది. కాగా, రెండు రోజుల తుంగతుర్తిలో ఇరు వర్గాల నేతల తమ మద్దతుదారులు, కార్యకర్తలతో బలప్రదర్శన నిర్వహించినట్లు అయిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాలపైన జగ్గారెడ్డి మాట్లాడుతూ తుంగతుర్తిలో నెలకొన్న సమస్యలపైన నేతలతో వరుసగా భేటీ అవుతున్నానని, సూర్యాపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య కూడా రెండు రోజులుగా ఈ సమావేశంలో పాల్గొంటున్నారని తెలిపారు. స్థానికంగా ఎమ్మెల్యే, ఎంపీ, డీసీసీలకి ప్రాధాన్యత ఉంటుందని, ముగ్గుర్ని సమన్వయం చేస్తామన్నారు. రెండు రోజుల సమావేశ వివరాలను నివేదిక రూపంలో సోమవారం టీపీసీసీ అధ్యక్షుడికి ఇస్తామని, ఆ తర్వాత సీఎం, టీపీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ లు నిర్ణయం తీసుకుంటారని జగ్గారెడ్డి తెలిపారు. పార్టీలో కొత్త, పాత ఏమి ఉండదని, నేతలకు మాట్లాడే స్వేచ్ఛ కాంగ్రెస్ లోనే ఎక్కువగా ఉంటుందన్నారు.






