వెల్గటూర్‌లో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

by Kodari Anjali |

27 ఏండ్ల తర్వాత 10వ తరగతి కలిసి చదువుకున్న విద్యార్థులంతా ఒకచోట చేరి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

వెల్గటూర్‌లో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
X

దిశ, వెల్గటూర్: వెల్గటూర్ మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ వెల్గటూర్‌లో 10వ తరగతి కలిసి చదువుకున్న విద్యార్థులు ఆదివారం శ్రీ నాగపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పూర్వ విద్యార్థులు అంత కలిసి అపూర్వ సమ్మేళనాన్ని జరుపుకున్నారు. 27 ఏండ్ల తర్వాత చిన్ననాటి స్నేహితులు అంతా అప్పుడు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను కలుసుకొని రోజంతా ఆనందంగా గడిపారు. ఈ సందర్బంగా ఆనాడు ఆడుకున్న ఆటలు, తిరిగిన ప్రదేశాలు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటా రోజంతా ఆనందంగా గడిపారు. అరేయ్ ఎం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు, పెళ్లి చేసుకున్నావా? పిల్లలు ఎంత మంది? ఏం చదువుతున్నారు? అనే కుశల ప్రశ్నలతో విద్యార్థులంతా ఉల్లాసంగా గడిపారు. ఆనాడు విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులు మాజీ ఎంఈఓ చంద్రయ్య, ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, బంగారయ్య లింగయ్య, రవీందర్ కన్నయ్య, అటెండర్ బీమయ్యను విద్యార్థులు శాలువాతో సన్మానించారు. 27 సంవత్సరాల కాలం గడిచిన తమను గుర్తుంచుకొని.. ఆహ్వానించి చిరు సత్కారం చేసిన విద్యార్థులకు ఉపాధ్యా యులు అభినందనలు తెలియజేశారు.

Next Story