పాల్వంచ అభివృద్ధిపై కూనంనేని మార్క్.

by Kodari Anjali |

రూ. 38లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయం రోడ్డు, డ్రైన్ సమస్యకు చెక్ పడింది.

పాల్వంచ అభివృద్ధిపై కూనంనేని మార్క్.
X

దిశ, పాల్వంచ: పాల్వంచ పట్టణ ప్రజల దశాబ్దాల కష్టాలను, ఇబ్బందులను స్వయంగా గుర్తించిన కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే ధ్యేయంగా ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పాల్వంచ పోలీస్ పెట్రోల్ బంక్ నుండి మణికంఠ బుక్ షాప్(బిసిఎం రోడ్ నుండి పాల్వంచ డివిజన్ మున్సిపల్ కార్యాలయం) వరకు సుమారు 300 మీటర్ల మేర అధ్వాన్నంగా మారిన రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనుల కోసం రూ. 38 లక్షల భారీ డీఎంఎఫ్‌టీ నిధులను ఆయన ప్రత్యేకంగా మంజూరు చేయించారు. నిధుల మంజూరు ప్రక్రియ నుండి పనుల రూపకల్పన వరకు ప్రతి దశలోనూ ఎమ్మెల్యే స్వయంగా పర్యవేక్షించి, ప్రజల ఇబ్బందులను తొలగించడమే ఏకైక లక్ష్యంగా ముందడుగు వేశారు. సాంకేతిక కారణాల వల్ల పనులు ప్రారంభంలో స్వల్ప జాప్యం జరిగినప్పటికీ, అధికారులతో నిరంతరం సమీక్షలు జరిపి పనులను పట్టాలెక్కించింది, ఇప్పుడు వాటిని ముమ్మరంగా సాగించేలా చేసింది. కేవలం ఎమ్మెల్యే కూనంనేని చిత్తశుద్ధి మాత్రమే. స్థానిక ప్రజలకు అత్యుత్తమ సదుపాయాలు కల్పించాలనే సంకల్పంతోనే ఈ ప్రాజెక్టును ఆయనే స్వయంగా మంజూరు చేయించారు.

నిజమైన నాయకుడు ప్రజల పక్షాన నిలబడి..

ఆయనే దగ్గరుండి పనులను వేగవంతం చేయిస్తున్నారు. అతి త్వరలోనే పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే బాధ్యతను కూడా ఆయనే భుజానకెత్తుకున్నారు. ఈ అభివృద్ధి పనుల వెనుక కేవలం ఎమ్మెల్యే నిరంతర శ్రమ, నిబద్ధత మాత్రమే ఉన్నాయనేది అక్షర సత్యం. అభివృద్ధి అనేది ఒకరి ఒత్తిడి వల్లనో, అనాలోచిత మాటల వల్లనో జరిగేది కాదు; దానికి పక్కా ప్రణాళిక, నిధుల సాధన, ప్రజా సంక్షేమంపై నిజమైన తపన ఉండాలి. ఆ లక్షణాలు కూనంనేనిలో పుష్కలంగా ఉన్నాయి. కొంతమంది కేవలం మాటలకే పరిమితమై, జరుగుతున్న పనుల క్రెడిట్ కోసం తాపత్రయపడటం హాస్యాస్పదంగా మారింది. నిజమైన నాయకుడు ప్రజల పక్షాన నిలబడి పని చేసి చూపిస్తాడు తప్ప, అనవసర ప్రచారాలకు తావు ఇవ్వడనే విషయాన్ని ఇక్కడ జరుగుతున్న పనుల వేగమే నిరూపిస్తోంది. పనులను వేగవంతంగా పూర్తి చేసి, పాల్వంచ ప్రజల కష్టాలను శాశ్వతంగా తీర్చడమే ధ్యేయంగా ఎమ్మెల్యే మార్గదర్శకత్వంలో పనులు శరవేగంగా సాగుతుండటం పట్ల స్థానిక ప్రజలు పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంకల్పం కూనంనేనిది, సాధన కూనంనేనిది.. కాబట్టి ఈ విజయం కూడా నిస్సందేహంగా కూనంనేనిదేనని పాల్వంచ నియోజకవర్గ ప్రజలు స్పష్టం చేస్తున్నారు.

Next Story