- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగస్టు 7న బెంగళూరులో 11వ జాతీయ ఓబీసీ మహాసభ
దేశవ్యాప్తంగా ఉన్న బీసీలను రాజకీయ పార్టీలకతీతంగా ఏకతాటిపైకి తీసుకువచ్చే లక్ష్యంతో, ఆగస్టు 7న బెంగళూరులో 11వ జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహించనున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఉన్న బీసీలను రాజకీయ పార్టీలకతీతంగా ఏకతాటిపైకి తీసుకువచ్చే లక్ష్యంతో, ఆగస్టు 7న బెంగళూరులో 11వ జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహించనున్నారు. ఆదివారం బెంగళూరులో ఈ మహాసభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్రీయ ఓబీసీ మహాసభ మహారాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ బాబన్ రావు తైవాడే, ఏపీ అధ్యక్షుడు కేసన శంకర్ రావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల్ కమిషన్ సిఫారసుల అమలును గుర్తుచేస్తూ ప్రతి ఏటా ఆగస్టు 7న ఈ మహాసభను నిర్వహిస్తున్నామని తెలిపారు. బెంగళూరులోని డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రతినిధులు హాజరుకానున్న ఈ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ యాదవ్, సచిన్ రాజోల్కర్, ప్రొఫెసర్ సంఘని మల్లేష్, తాటికొండ విక్రమ్ గౌడ్, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కనకాల శ్యామ్ కురుమ తదితరులు పాల్గొన్నారు.






