ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలి

by Taduka Kalyani |

రాష్ట్ర ప్రభుత్వం షాబాద్ మండలంలో జరిగిన ఆరు హత్యలపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే నిందితుడిని వెంటనే పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.

ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలి
X

దిశ, షాబాద్: రాష్ట్ర ప్రభుత్వం షాబాద్ మండలంలో జరిగిన ఆరు హత్యలపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే నిందితుడిని వెంటనే పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం షాబాద్ మండల కేంద్రంలోని బాధిత కుటుంబాన్ని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరామర్శించారు. అనాథగా మిగిలిన మైనర్ బాలిక దివ్యాంగురాలైన అక్క మేఘన ను పరామర్శించి, కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పోలీసులు చేసిన నిర్లక్ష్యం వల్ల ఆరుగురు నిండు ప్రాణాలు బలి అయ్యాయని, పోలీసు శాఖ తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రాజ్ కుమార్ అనే నరహంతకుడు మరణించిన మైనర్ బాలికను అడుగడుగున వేధించేవాడని, కుటుంబ సభ్యులు అతడి గురించి పోలీసులకు తెలిపి, బాలిక కుటుంబ సభ్యులు అతడిపై పోక్సో కేసు నమోదు చేయించారని తెలిపారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశామని మీది మీదికి చెప్పి నిందితులకే పోలీసులు మద్దతు తెలిపారని కుటుంబ సభ్యులు చెప్తున్న విషయాలతో అర్థమవుతుందని అన్నారు. పోలీసు శాఖ అనే దీనికి పూర్తి బాధ్యత వహించాలని, చట్టాలనేవి నిందితులకు చుట్టాలుగా ఉండకూడదని పేర్కొన్నారు.

కరుడుగట్టిన టెర్రరిస్టులాగా హంతకుడు రాజకుమార్ తన భార్య పిల్లలను, మైనర్ బాలిక, అమ్మను, అమ్మమ్మను అతి కిరాతకంగా చంపాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు కూడా కఠినంగా వ్యవహరించి ఉంటే ఎటువంటి దారుణాలు జరిగేవి కావని, ఇటువంటి మానవ మృగాలను కఠినంగా శిక్షించే విధంగా అందరూ తమ బాధ్యతలను నిర్వర్తించాలని అన్నారు. నిందితుడిది తండ్రి, అతడి అన్న బాధ్యతలు మరిచి అతడి అన్న అధికారులను, పోలీసులను మ్యానేజ్ చేస్తూ తమ్ముడికి సహకరించడం వల్లనే ఇంతటి దారుణం జరిగిందని, నిందితుడు తండ్రి, అన్నలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆదుకోవాలని కోరారు.పోలీసులు సహకరించినప్పుడే ఇటువంటి నేరస్తులు తయారవుతారని అన్నారు. పోలీసుల పరిపాలన నిర్లక్ష్యం వలన ఇంతటి ఘోరం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే నిందితుడిని వెంటనే పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలని కోరారు. ప్రభుత్వం కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకోవడం సరికాదని, నిందితుడు వెంటనే పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనిపై డిజిపి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, అవసరమైతే అసెంబ్లీలో కూడా మాట్లాడుతానని తెలిపారు. అనంతరం బాధిత కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

Next Story