అడవి పందుల అక్రమ రవాణా..

by Kodari Anjali |

పోలీసుల పెట్రోలింగ్ లో ఓ వ్యక్తి తో పాటు 7 పందులు స్వాధీనం చేసుకున్నారు.

అడవి పందుల అక్రమ రవాణా..
X

దిశ, నేలకొండపల్లి: తెల్లవారు జామున పెట్రోలింగ్ చేస్తున్న నేలకొండపల్లి పోలీసులకు రోడ్డు పక్కన ఆగిఉన్న మినీ డీసీయం వాహనంపై అనుమానంతో తనిఖీ చేయగా.. కాళ్ళు, నోరు కట్టి పడేసి, అక్రమంగా రవాణా చేస్తున్న ఏడు అడవి పందులు ఘటన నేలకొండపల్లిలో జరిగింది. నేలకొండపల్లి మండలం చెరువుమాధారం గ్రామంలో పోలీసుల సాధారణ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, రోడ్డు పక్కన అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన వాహనం కంటపడింది. దీంతో సిబ్బంది తనిఖీ చేయగా, మాంసం విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన 7 అడవి పందులు ఉండటంతో అవాక్కైన పోలీసులు డ్రైవర్‌ను విచారించారు. దీంతో అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది. దీంతో వాహనం, డ్రైవర్ పుట్టబంతి నాగయ్యతో సహా 7పందులను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారమందించారు. వారి సూచన మేరకు అటవీ శాఖ అధికారులకు తెలియపర్చగా అక్రమ రవాణా చేస్తున్న పందులను స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పటికే గాలి ఆడని పరిస్థితులలో 2 పందులు మృత్యువాత పడ్డాయి. స్వాధీనం చేసుకున్న పందులను వెలుగుమట్ల అడవిలో వదిలినట్లు, చనిపోయిన 2 పందుల కు పోస్ట్ మార్టం నిర్వహించి ఖననం చేయనున్నట్లు, నిందితునిపై అటవి చట్టాల ప్రకారం కేసు నమోదు చేయనున్నట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.

Next Story