ముఖ్యమంత్రిని కలిసిన తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ.. ఆదివాసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వినతి

by Kodari Anjali |

తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రాష్ట్రంలోని ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించింది.

ముఖ్యమంత్రిని కలిసిన తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ.. ఆదివాసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వినతి
X

దిశ, ఇల్లెందు: తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రాష్ట్రంలోని ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆదివాసుల రిజర్వేషన్ల దోపిడీ, ఏజెన్సీ ప్రాంతాల్లో వలసవాదుల ఆధిపత్యం, భూకబ్జాలు, ఆదివాసి హక్కుల ఉల్లంఘన వంటి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసం నరసింహారావు తెలిపారు. పోడు భూములకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని, జీవో నెం.3 పరిధిలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని కోరారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలంలో వైద్య సదుపాయాల కొరత కారణంగా గర్భిణీ ఆదివాసి మహిళలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితిని వివరించి, అత్యవసర వైద్య సేవలను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భూకబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయని, ఆదివాసుల భూములు గిరిజనేతరుల పేర్లపై నమోదవుతున్నాయని, రెవెన్యూ అధికారులు చట్టాలను సమర్థంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. వన్ ఆఫ్ సెవెంటీ (1/70) చట్టం అమలులో నిర్వీర్యమైందని, పీసా చట్టాన్ని అధికారులు గౌరవించడం లేదని పేర్కొన్నారు.

Next Story