పారదర్శకంగా ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించాలి:అదనపు కలెక్టర్

by Taduka Kalyani |

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి మండలంలోని ఇరిగిపల్లి,

పారదర్శకంగా ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించాలి:అదనపు కలెక్టర్
X

దిశ, సంగారెడ్డి అర్బన్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి మండలంలోని ఇరిగిపల్లి, హనుమాన్ నగర్ తండా తో పాటు సంగారెడ్డి మున్సిపాలిటీ 28 వ వార్డు లో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ ఫారాల సేకరణ కేంద్రాలను అదనపు కలెక్టర్ పాండు పరిశీలించారు. ఈ సందర్భంగా ఫారాల స్వీకరణ, నమోదు ప్రక్రియ, ప్రజలకు అందిస్తున్న సేవలపై అధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, కౌన్సిలర్లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు తమ ఓటరు వివరాలను సరి చేసుకునేందుకు, కొత్తగా నమోదు చేసుకునేందుకు ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ జయరాం, కౌన్సిలర్ సంగీత మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Next Story