కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

by Batti.Sumithra |

కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమేశ్వర్ గ్రామంలో జరిగింది.

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, బాన్సువాడ : కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమేశ్వర్ గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామానికి చెందిన చల్ల సాయిలు (55) వడ్డెర వృత్తికి చెందిన కూలీ. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మొదటి భార్య మరణించడంతో సుమారు 20 సంవత్సరాల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. పెళ్లైనప్పటి నుంచి భార్యాభర్తలు కలిసిమెలసి ఉండేవారు. అయితే, గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడి తరచూ గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికి చెందిన సాయిలు ఇంట్లోని గదిలో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడి మొదటి భార్య కుమారుడు శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ తుల శ్రీధర్ తెలిపారు.

Next Story