అక్రమంగా తరలిస్తున్న 23 గోవుల పట్టివేత

by Batti.Sumithra |

అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి, 23 గోవులతో పాటు ఒక గేదెను ఆదివారం పట్టుకుని బాటసింగారం గోశాలకు తరలించినట్లు ఎస్‌ఐ యుగంధర్ గౌడ్ తెలిపారు.

అక్రమంగా తరలిస్తున్న 23 గోవుల పట్టివేత
X

దిశ, వలిగొండ : అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి, 23 గోవులతో పాటు ఒక గేదెను ఆదివారం పట్టుకుని బాటసింగారం గోశాలకు తరలించినట్లు ఎస్‌ఐ యుగంధర్ గౌడ్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అక్రమంగా కంటైనర్ వాహనంలో గోవులను తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు, అనుమానంతో వలిగొండ–తొర్రూరు చౌరస్తా వద్ద అశోక్ లేలాండ్ కంటైనర్ వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో 23 గోవులు, ఒక గేదె ఉన్నట్లు గుర్తించి వాహనాన్ని సీజ్ చేశారు. విచారణలో, గోవులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా గురజాల నుంచి మేదక్ జిల్లా చేర్యాల మార్కెట్‌కు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Next Story