- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతి డ్రగ్స్ కేసు.. అరెస్టైన ముగ్గురిలో ఒకరు టీటీడీ ఉద్యోగి...!
తిరుపతి డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరెస్టైన ముగ్గురిలో రాహుల్ యాదవ్ టీటీడీ ఉద్యోగిగా గుర్తించారు. అర్చక భవన్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నట్లు తేలింది. ...

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరెస్టైన ముగ్గురిలో రాహుల్ యాదవ్ టీటీడీ ఉద్యోగిగా గుర్తించారు. అర్చక భవన్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నట్లు తేలింది. దీంతో టీటీడీలో ఒక్కసారిగా కలకలం రేగింది. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో పని చేస్తూ డ్రగ్స్ దందా చేయడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీటీడీకి చెడ్డ పేరు తెచ్చిన రాహుల్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు.
కాగా ఈ నెల 10న తిరుపతిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాలేజీ విద్యార్థులకు నిందితులు తెల్ల గుణశేఖర్, ఎస్. ఆశ్విన్ కుమార్, పడమల రాహుల్ యాదవ్ ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వీరి నుంచి రూ.3 లక్షల విలువైన డ్రగ్స్ తో పాటు రెండు రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు, నాలుగు సెల్ ఫోన్లు, రెండు డిజిటల్ వెయింగ్ మెషీన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో నిందితుడు రాహుల్ యాదవ్ గుట్టురట్టు అయింది.






