- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tyre Companies: ధరలు పెంచేస్తున్న టైర్ల కంపెనీలు
పెరిగిన ఖర్చులను భర్తీ చేసుకునేందుకు జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది ద్వితీయార్థంలో టైర్ల ధరలను 11–13 శాతం వరకు పెంచాలని భావిస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ముడిసరుకుల ధరలు భారీగా పెరగడంతో దేశంలోని టైర్ తయారీ సంస్థలు ధరల పెంపు బాట పడుతున్నాయి. పెరిగిన ఖర్చులను భర్తీ చేసుకునేందుకు జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది ద్వితీయార్థంలో టైర్ల ధరలను 11–13 శాతం వరకు పెంచాలని భావిస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, రవాణా అంతరాయాలు, సరఫరా సమస్యల కారణంగా ముడిసరుకుల ఖర్చులు దాదాపు 20 శాతానికి పైగా పెరిగాయని సంస్థ సీఎఫ్‌ఓ సంజీవ్ అగర్వాల్ చెప్పారు. టైర్ తయారీలో ప్రధానమైన సహజమైన రబ్బర్, సింథటిక్ రబ్బర్, కార్బన్ బ్లాక్, స్టీల్ వంటి ముడిసరుకుల వాటా కంపెనీ మొత్తం ఖర్చుల్లో దాదాపు మూడింట రెండు వంతులు ఉంటుంది. దీంతో జేకే టైర్ మేలో ప్రకటించిన 5–6 శాతం పెంపుతో పాటు, మిగిలిన పెంపును రాబోయే నెలల్లో అమలు చేయనుంది. ఇప్పటికే అపోలో టైర్స్, సియాట్ వంటి కంపెనీలు ధరలు పెంచగా, ఇప్పుడు జేకే టైర్ కూడా అదే దారిలో నడుస్తోంది. వాహన అమ్మకాలు జూన్‌లో 21.8 శాతం పెరగడం వల్ల మార్కెట్ డిమాండ్ బలంగా ఉండటంతో, కంపెనీలు పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని వినియోగదారులకు బదిలీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.






