- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర.. ఇటువైపు నిఘా పెట్టాలే
చీప్ లిక్కర్‌తో పాటు గంజాయి మత్తులో రాబరీలు చేస్తున్నారు.

దిశ, భిక్కనూరు : చీప్ లిక్కర్‌తో పాటు గంజాయి మత్తులో రాబరీలు చేస్తున్నారు. ఒంటి పై బట్టలు లేకుండా కొందరు తాగుబోతులు ఎక్కడపడితే అక్కడ పడుకుంటున్నారు. మత్తులో జోగుతూ భార్య, పిల్లలపై చేయి చేసుకునే పరిస్థితికి దిగజారారు. ఇకనైనా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు మా గ్రామం పై నిఘా పెట్టాలని కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆదివారం గ్రామంలోని వాట్సాప్ గ్రూపులో పెట్టిన ఈ మెసేజ్‌లు వైరల్‌గా మారాయి. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు కొనసాగడం వల్ల ఉదయం లేస్తే చాలు, చాయికి బదులుగా మందు, చీప్ లిక్కర్ తాగేస్తున్నారని పేర్కొన్నారు.
అంతేకాకుండా గంజాయి మత్తులో ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న పైప్‌లైన్లను ధ్వంసం చేశారని, బైక్‌ను ఎత్తుకెళ్లారని తెలిపారు. పని చేసుకుని వచ్చే డబ్బులతో గంజాయి, మత్తు మందుల్లో జల్సా చేస్తూ కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూటికి నూరు శాతం విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్ట్ షాపుల వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు గంజాయి సరఫరా చేసే వారితో పాటు గంజాయి సేవించే వారి వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. ఇకనైనా అధికారులు తమ గ్రామం పై దృష్టి సారించి, అటు బెల్ట్ షాపులను, ఇటు గంజాయి సరఫరాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పోస్టుల్లో కోరారు.






