డ్యాన్స్ అసోసియేషన్‌లో ఎన్నికల వివాదం.. జానీ, శేఖర్ వర్గాల మధ్య విభేదాలు?

by Ramesh Naini |

తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ఎన్నికలు, సభ్యత్వాల అంశాలపై విభేదాలు నెలకొన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

డ్యాన్స్ అసోసియేషన్‌లో ఎన్నికల వివాదం.. జానీ, శేఖర్ వర్గాల మధ్య విభేదాలు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ఎన్నికలు, సభ్యత్వాల అంశాలపై విభేదాలు నెలకొన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్‌కు చెందిన వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఫెడరేషన్ అనుమతి లేకుండా బై ఎలక్షన్ నిర్వహించే ప్రయత్నాలపై అభ్యంతరాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది.

ఎన్నికల నిర్వహణ విధానం, సభ్యత్వాలకు సంబంధించిన అంశాల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో అసోసియేషన్‌కు చెందిన సుమారు 10 మంది డాన్సర్లు రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ వెలువడలేదు. ఇదిలా ఉండగా, అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత వ్యవహారశైలిపై కొందరు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చర్చ సాగుతోంది. అయితే ఈ ఆరోపణలపై ఆమె నుంచి స్పందన రాలేదు. అలాగే ఈ మొత్తం వ్యవహారంపై జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ లేదా అసోసియేషన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Next Story