- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్దూరులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. విచారణ చేపట్టిన ఏసీపీ
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామంలో నమోదైన ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ) కేసు దర్యాప్తు వేగవంతమైంది.

దిశ, మద్దూరు: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామంలో నమోదైన ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ) కేసు దర్యాప్తు వేగవంతమైంది. కేసు విచారణలో భాగంగా హుస్నాబాద్ ఏసీపీ సదానందం ఆదివారం గ్రామాన్ని సందర్శించి సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. వల్లంపట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ వెంచర్‌కు అనుమతి విషయమై గ్రామానికి చెందిన యాదయ్య, హైదరాబాద్‌కు చెందిన బాబు గౌడ్ పంచాయతీ కార్యదర్శిని కలిశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సర్పంచ్ భర్త కర్నె మనోహర్‌కు యాదయ్యతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన యాదయ్య తల్లి మరియమ్మ.. తన కుమారుడిని ఎందుకు దూషిస్తున్నారని ప్రశ్నించగా, తనను కులం పేరుతో అవమానించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.డి. ఆసిఫ్ తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా హుస్నాబాద్ ఏసీపీ సదానందం సంఘటనా స్థలాన్ని పరిశీలించి, సంబంధిత సాక్షులను విచారించారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. కేసుకు సంబంధించిన అన్ని అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.






