శాశ్వత వైద్యులను నియమించాలని సీపీఐ(ఎం) నాయకులు డిమాండ్

by Kodari Anjali |

అత్యవసరమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సిపిఐ (ఎం) జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శాశ్వత వైద్యులను నియమించాలని సీపీఐ(ఎం) నాయకులు డిమాండ్
X

దిశ, సత్తుపల్లి: సత్తుపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వెంటనే వైద్యులను నియమించాలని, అత్యవసరమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సిపిఐ (ఎం ) జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు, జాజిరి శ్రీనివాస్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆ పార్టీ కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రిలో 59 మంది డాక్టర్లకు ప్రస్తుతం 12 మంది మాత్రమే ఉన్నారు అన్నారు. వారిలో ఏడుగురు మాత్రమే రెగ్యులర్ డాక్టర్లు ఉన్నారు. స్టాప్ నర్సులు 30 మందికి పది మంది మాత్రమే ఉన్నారు అన్నారు. స్వీపర్సు పది మందే ఉన్నారు అన్నారు. దీనివలన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రస్తుతం ఉన్న సంఖ్య సరిపోవటం లేదన్నారు. కోట్ల రూపాయలు ఏరియా ఆసుపత్రికి కేటాయించిన డాక్టర్లు లేకపోవడం వలన గ్రామీణ ప్రజలు అనారోగ్య సమస్యలకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఈ ఆసుపత్రికి పక్కనున్న ఆంధ్ర రాష్ట్రం నుండి మరియు అశ్వరావుపేట, దమ్మపేట, ములకలపల్లి, పెనుబల్లి, అన్నపురెడ్డిపల్లి, వేంసూరు ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో వైద్యం కోసం వస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే వైద్యులు నియమించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కొలిక పోగు సర్వేశ్వరరావు, పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు రావుల రాజబాబు, చప్పిడి భాస్కర్, చావా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story