- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tragedy: చెరువులో ఈతకు దిగి బాలుడి మృతి
by Vemula.Srinu Prasad |
చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి బాలుడు మృతి చెందిన విషాద ఘటన త్రిపురాంతకం మండలం గొల్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ..

X
దిశ, ఎర్రగొండపాలెం: చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి బాలుడు మృతి చెందిన విషాద ఘటన త్రిపురాంతకం మండలం గొల్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గొల్లపల్లి గ్రామానికి చెందిన ఉప్పలపాటి పిచ్చయ్య కుమారుడు ఉప్పలపాటి తిరుమలబాబు (15) చెరువులో ఈతకు దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి ప్రాణాలు విడిచాడు. తమ కుమారుడు ఇలా అర్ధాంతరంగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాలుడి మరణంతో గొల్లపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story






