- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమృద్ధిగా వర్షాలు కురవాలి.. ప్రజలు సుభిక్షంగా ఉండాలి
తెలంగాణ రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా జీవించాలని ఎమ్మెల్సీ, ఆదివాసి కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర చైర్మన్ శంకర్ నాయక్ ఆకాంక్షించారు.

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు) : తెలంగాణ రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా జీవించాలని ఎమ్మెల్సీ, ఆదివాసి కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర చైర్మన్ శంకర్ నాయక్ ఆకాంక్షించారు. ఆదివారం పాలకవీడు మండలం కల్మెట తండాలో నిర్వహించిన గిరిజనుల ఆరాధ్య దైవమైన శీత్లా భవాని (శీతలా మాత) పండుగ వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి గిరిజనులతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ "శీత్లా పండుగ బంజారా (లంబాడా) గిరిజనుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీక.
ప్రకృతిని, శీత్లా మాతను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ పాడిపంటలు సమృద్ధిగా పండాలని, పశుసంపద వృద్ధి చెందాలని, కుటుంబాలు సుఖశాంతులతో ఉండాలని, అంటువ్యాధులు, వేసవి తాపం నుంచి ప్రజలు రక్షణ పొందాలని ఈ పండుగను జరుపుకుంటారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం" అని అన్నారు. పండుగ సందర్భంగా గిరిజన మహిళలు గుగ్గిళ్లు వండి శీత్లా మాతకు నైవేద్యం సమర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గిరిజన మహిళలు, యువకులతో కలిసి సాంప్రదాయ నృత్యాల్లో పాల్గొని అలరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాలోత్ మోతీలాల్ నాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.వి. సుబ్బారావు, మాజీ ఎంపీపీ భూక్యా గోపాల్, గ్రామ సర్పంచ్ భూక్యా చరణ్, జాన్‌పహాడ్ సర్పంచ్ కవిత కిరణ్ నాయక్, నాయకులు నాగరాజు, రాము, శోభన్, సైదా, వీరన్న తదితరులు పాల్గొన్నారు.






