నాగార్జునపై ఒట్టేసి చెబుతున్నా.. అక్కినేని ఫ్యామిలీలోనే బెస్ట్ యాక్టర్ అఖిల్: ఆర్జీవీ

by Malleboina Mahesh |   (  Updated:2026-07-12 13:52:14  IST  )

అక్కినేని అఖిల్ లెనిన్ సినిమా చూసిన తర్వాత దర్శకుడు ఆర్జీవీ ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు.

నాగార్జునపై ఒట్టేసి చెబుతున్నా.. అక్కినేని ఫ్యామిలీలోనే బెస్ట్ యాక్టర్ అఖిల్: ఆర్జీవీ
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma).. యంగ్ హీరో అక్కినేని అఖిల్ పై సంచలన ట్వీట్ (Sensational tweet) చేశారు. రెండు రోజుల క్రితం అఖిల్ హీరోగా నటించిన చిత్రం 'లెనిన్' (Lenin) ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలోనే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై, అఖిల్ నటనపై చేసిన ఒక సంచలన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర వైరల్‌గా మారింది. అఖిల్ నటనను ఆకాశానికెత్తుతూ వర్మ తనదైన శైలిలో స్పందించారు.

నాగార్జునపై ఒట్టేసి చెబుతున్నా..

ఆర్జీవీ తన ట్వీట్‌లో "హే అఖిల్.. నేను ఇప్పుడే 'లెనిన్' సినిమా చూశాను. సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఇది పక్కన పెడితే.. అక్కినేని ఫ్యామిలీ (Akkineni Family) మొత్తంలోనే నువ్వే బెస్ట్ యాక్టర్ (ఉత్తమ నటుడివి) అని నేను రియలైజ్ అయ్యాను. ఈ మాటను మీ నాన్న నాగార్జునపై ఒట్టేసి మరీ చెబుతున్నాను. నార్మల్ సీన్స్‌లోనూ నీ నటనలో కనిపించిన ఈజ్ (Ease) అద్భుతం. ఇక ఎమోషనల్ సీన్స్‌లో అయితే నువ్వు నటనతో చంపేశావ్ (Killed it). అఖిల్‌కు ఇంతటి అద్భుతమైన పాత్రను, నటనకు స్కోప్ ఉన్న హావభావాలను అందించినందుకు దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరికి బిగ్ షౌట్ అవుట్" అంటూ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ (X) వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. చాలా కాలం తర్వాత అఖిల్‌కు సాలిడ్ సక్సెస్ దక్కడం, దానికి తోడు ఆర్జీవీ లాంటి దర్శకుడు ఈ స్థాయిలో అభినందించడంతో అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Next Story