- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మట్టేవాడలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు
గ్రామాల్లో నిషేధిత, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు సీఐ వినయ్ కుమార్ హెచ్చరించారు.

దిశ, గూడూరు : గ్రామాల్లో నిషేధిత, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు సీఐ వినయ్ కుమార్ హెచ్చరించారు. ఆదివారం గూడూరు మండలం మట్టేవాడ గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తయారు చేస్తున్న గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌ను సీజ్ చేసి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పత్రాలు లేకుండా వాహనాలు నడిపే వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు. అదేవిధంగా గ్రామస్తులకు గుడుంబా, గంజాయి తదితర మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో శాంతియుతంగా జీవిస్తూ చట్టాలను గౌరవించాలని సీఐ వినయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎస్సై గిరిధర్ రెడ్డి, కొత్తగూడ ఎస్సైతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






