- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి మెయిన్ హాస్పిటల్‌లో సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్
సింగరేణి ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన కార్మికులు, వారి కుటుంబ సభ్యుల కోసం కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్‌లో ఆదివారం సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు.

దిశ, కొత్తగూడెం సింగరేణి: సింగరేణి ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన కార్మికులు, వారి కుటుంబ సభ్యుల కోసం కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్‌లో ఆదివారం సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి, డైరెక్టర్ (పా) గౌతమ్ పొట్రు ఆదేశాలు, సీఎంఓ డా. ఆర్. కిరణ్ రాజ్ కుమార్ సూచనల మేరకు హైదరాబాద్‌కు చెందిన మెడికోవర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్య నిపుణులు ఈ శిబిరంలో సేవలందించారు. కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల్లో మొత్తం 66 మంది రోగులకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో కార్డియాలజీ విభాగంలో 32 మంది, న్యూరాలజీలో 26 మంది, గ్యాస్ట్రోఎంటరాలజీలో 8 మంది వైద్య సేవలు పొందారు. ఈ సందర్భంగా సీఎంఓ డాక్టర్ ఆర్. కిరణ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ... ఉద్యోగులు, రిటైర్డ్ కార్మికులు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను సింగరేణి ఆస్పత్రులలోనే అందిస్తున్నామని తెలిపారు. ప్రతి రెండో ఆదివారం ఈ ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అడిషనల్ సీఎంఓ డా. ఉష పర్యవేక్షణలో నిర్వహించిన ఈ శిబిరంలో హెల్త్ ఆఫీసర్ డా. డి. లలితతో పాటు మెయిన్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.






