మెట్‌పల్లిలో మహిళా దారుణ హత్య..

by Kodari Anjali |

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో మహిళను దారుణ హత్య చేసిన ఘటన కలకలం రేపింది.

మెట్‌పల్లిలో మహిళా దారుణ హత్య..
X

దిశ, మెట్‌పల్లి: జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో మహిళను దారుణ హత్య చేసిన ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మెట్ పల్లి పట్టణంలోని శాంతినగర్ కాలనీలో నివాసం ఉంటున్న కర్రె సుజాత (34) అనే మహిళ మెడపై పదునైనా ఆయుధంతో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్య చేసి పరరైనట్లు తెలిపారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న మెట్‌పల్లి సీఐ, సురేష్ బాబు, ఎస్సై కిరణ్ కుమార్ లు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story