- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మధ్యాహ్న భోజన కార్మికులకు బీజేపీ సంపూర్ణ మద్దతు
ధర్నా చౌక్‌లో మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు తప్పిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఫైర్!

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిరోజూ పౌష్టికాహారాన్ని అందిస్తూ ఎంతో పవిత్రమైన బాధ్యతను నిర్వర్తిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల నిరసనకు భారతీయ జనతా పార్టీ (BJP) సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించింది. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో నిర్వహించిన మధ్యాహ్న భోజన కార్మికుల మహాధర్నాలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు 54 వేల మంది కార్మికులు ఎదుర్కొంటున్న న్యాయమైన, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని గట్టిగా డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు ₹10,000 గౌరవ వేతనం అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రెండున్నరేళ్లు గడిచినా ఆ ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని రాంచందర్ రావు ఆరోపించారు. కనీసం ప్రస్తుతం ఇస్తున్న అరకొర ₹3,000 గౌరవ వేతనాన్ని కూడా సమయానికి చెల్లించకుండా నెలల తరబడి బకాయిలు గా ఉంచడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. కార్మికుల న్యాయం, గౌరవం, వేతనాల కోసం వారు సాగిస్తున్న ఈ పోరాటానికి భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.






