ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి..

by Kodari Anjali |

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్యాదపూర్వకంగా కలిసి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి..
X

దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం జిల్లా నూతనంగా ఏర్పాటైన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావును ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ స్థాయిలో చొరవ తీసుకుని పోరాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను నియమిస్తున్న ఏజెన్సీల్లో భారీ అక్రమాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం అదే ఏజెన్సీలకు కొనసాగింపు ఉత్తర్వులు జారీ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ఉద్యోగుల జీతాలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు..

ప్రసూతి సెలవులకు వెళ్లే మహిళా ఉద్యోగులకు జీతం లేకుండా సెలవులు మంజూరు చేయడం, వారి స్థానాల్లో కొత్త నియామకాలు చేపట్టడం వల్ల అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ఒకే విధమైన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు శాఖలవారీగా, ప్రాంతాలవారీగా వేర్వేరు వేతనాలు చెల్లిస్తున్నారని, ఈ విధానానికి ముగింపు పలకాలని కోరారు. ప్రభుత్వం అమలు చేయనున్న నూతన ఆరోగ్య పథకంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను కూడా చేర్చాలని, ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జేఏసీ ప్రతినిధులు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోనగిరి రవికిరణ్, రాష్ట్ర నాయకులు కె. చంద్రశేఖర్ రావు, ఖమ్మం జిల్లా జేఏసీ అధ్యక్షుడు పేరాల నరేంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి వేల్పుల సుధాకర్, కోశాధికారి అర్వపల్లి నాగేంద్ర ప్రసాద్‌తో పాటు పలు శాఖలకు చెందిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story