ఎన్యూమరేషన్ ఫారం లో పూర్తి వివరాలు నమోదు చేయాలి..

by Taduka Kalyani |

ఫారం సమర్పించకపోతే భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓటరు జాబితా నుంచి పేరు తొలగించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు.

ఎన్యూమరేషన్ ఫారం లో పూర్తి వివరాలు నమోదు చేయాలి..
X

దిశ, శేరిలింగంపల్లి: ఫారం సమర్పించకపోతే భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓటరు జాబితా నుంచి పేరు తొలగించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తో కలిసి శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని గుల్మొహర్ పార్క్ కాలనీ, మై హోమ్ మంగళ గేటెడ్ కమ్యూనిటీ, ఎల్‌బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం లోని శ్రీ సాయిరాం కాలనీ (బీఎన్ రెడ్డి), సాహెబ్‌నగర్ కళ్యాణ మండపంలను సందర్శించి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటైజేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

సంబంధిత ఎన్నికల నమోదు అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు, బూత్ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లతో మాట్లాడి కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ప్రతి అర్హత ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం అందేలా చర్యలు తీసుకోవాలని, ఫారాలను పూర్తిగా నింపించి నిర్దేశిత గడువులోగా తిరిగి స్వీకరించేలా విస్తృత ప్రజా అవగాహన కల్పించాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవసరమైన సహాయం అందించడంతో పాటు, అందిన ఫారాలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులో డిజిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి వివరాలతో నింపి నిర్దేశిత గడువులోగా సంబంధిత బూత్ స్థాయి అధికారులకు తప్పనిసరిగా సమర్పించాలని కోరారు.

ఫారం సమర్పించని పక్షంలో భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓటరు జాబితా నుంచి పేరు తొలగించబడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఓటరు జాబితా నాణ్యతను మెరుగు పరచడం, అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడడమే ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి తమ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి వివరాలతో సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, ఆన్‌లైన్ డిజిటైజేషన్ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పూర్తి పారదర్శకతతో, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ప్రతి ఓటరిని గుర్తించేలా సమగ్రంగా ఎన్యూమరేషన్ నిర్వహించాలని సూచించారు. అలాగే, ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని పక్షంలో ఓటరు జాబితా నుంచి పేరు తొలగించబడే అవకాశంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని జిల్లాలో భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి అర్హత ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం అందేలా విస్తృత చర్యలు చేపట్టామని, పంపిణీ చేసిన ఫారాలను పూర్తి వివరాలతో నింపి నిర్దేశిత గడువులోగా సంబంధిత బూత్ స్థాయి అధికారులకు తప్పనిసరిగా సమర్పించాలని ప్రజలను కోరారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవసరమైన సహాయం అందించాలని, అందిన ఎన్యూమరేషన్ ఫారాలను క్షుణ్ణంగా పరిశీలించి డిజిటైజేషన్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా సమగ్రంగా ఎన్యూమరేషన్ నిర్వహించాలని సూచించారు. అలాగే, ఎన్యూమరేషన్ ఫారం సమర్పించని పక్షంలో భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓటరు జాబితా నుంచి పేరు తొలగించబడే అవకాశంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

Next Story