- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
12 ఏళ్లకే ఏఐ స్టార్టప్.. మూడు దేశాల్లో వ్యాపారం..
సాధారణంగా పన్నేండేళ్ల పిల్లలు హోమ్ వర్క్, స్పోర్ట్స్, స్నేహితులు అంటూ బిజీగా ఉంటారు. కానీ జంపాల మాత్రం ఏఐ స్టార్టప్‌ను నడుపుతోంది. ఇప్పటికే మూడు దేశాల్లో తన ప్లాట్ ఫామ్ ఉపయోగంలోకి రావడం విశేషం.

దిశ, ఫీచర్స్ : సాధారణంగా పన్నేండేళ్ల పిల్లలు హోమ్ వర్క్, స్పోర్ట్స్, స్నేహితులు అంటూ బిజీగా ఉంటారు. కానీ జంపాల మాత్రం ఏఐ స్టార్టప్‌ను నడుపుతోంది. ఇప్పటికే మూడు దేశాల్లో తన ప్లాట్ ఫామ్ ఉపయోగంలోకి రావడం విశేషం.
ఏడో తరగతి విద్యార్థిని అయిన జంపాలకు ప్రస్తుతం 12 ఏళ్లు. అయితే ఆమె తొమ్మిదేళ్ల వయసు నుంచే టెక్నాలజీపై ఫోకస్ చేసింది. పైథాన్ నేర్చుకుని.. ఏఐ ప్రొడక్ట్స్ తయారు చేయడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే వ్యాపార సంస్థలు కస్టమర్ కాల్స్ ఆటోమేట్ చేసుకోవడానికి, రోజువారీ పనులు సులభం చేయడానికి టూల్స్ రూపొందించింది. Voxa అనే AI-పవర్డ్ రిసెప్షనిస్ట్‌ను డెవలప్ చేసింది. ఇది వ్యాపార సంస్థలు కస్టమర్ కాల్స్ మిస్ కాకుండా సహాయపడుతుంది. ఈ ప్లాట్‌ఫాం ఇప్పటికే కెనడా, ఇండియా, కంబోడియాల్లో ఉపయోగంలో ఉంది.
కోడింగ్ జర్నీ
తనకు టెక్నాలజీపై ఆసక్తి చాలా చిన్న వయసులోనే మొదలైంది. స్క్రాచ్ క్యాంపుల ద్వారా కోడింగ్ నేర్చుకుని.. 9 ఏళ్ల వయసులో పైథాన్ నేర్చుకుంది. 11 ఏళ్ల వయసులో స్వయంగా AI ప్రొడక్ట్స్ బిల్డ్ చేయడం ప్రారంభించింది. భారత్‌లో జరిగిన కాలేజియట్ లెవల్ సైన్స్ కాంపిటీషన్‌లో స్పెషల్ ప్రైజ్ గెలిచింది. 1517 ఫండ్ మెడిసి ప్రాజెక్ట్ నుంచి గ్రాంట్ కూడా అందుకుంది. స్టార్టప్ నడుపుతున్నా.. ఆమె ఫుట్‌బాల్ ఆడడం, స్నేహితులతో సమయం గడపడం, ఇతర యువ బిల్డర్లను కలవడం వంటివి ఆనందిస్తుంది.
ఒక మిస్డ్ కాల్.. ఆలోచనకు మూలం
Voxa ఆలోచన ఆమె తండ్రి వర్క్‌ప్లేస్‌లో చూసిన సమస్య నుంచి వచ్చింది. ఉద్యోగులు కస్టమర్లను సర్వ్ చేస్తున్నప్పుడు కాల్స్ మిస్ అవుతున్నాయి. ఇది బిజినెస్ అవకాశాలను కోల్పోయేలా చేస్తోంది. దీన్ని పరిష్కరించడానికి 24 గంటల AI వాయిస్ అసిస్టెంట్‌గా Voxaను రూపొందించింది. ఇది రెస్టారెంట్లు, ఫార్మసీలు, సర్వీస్ బిజినెస్‌లకు ఉపయోగపడుతుంది. కాల్స్‌కు జవాబు ఇవ్వడం, అపాయింట్‌మెంట్లు బుక్ చేయడం, ఆర్డర్లు తీసుకోవడం, ఫాలో-అప్‌లు, కాన్వర్సేషన్ సమ్మరీలు ఇవ్వడం వంటివి చేస్తుంది. ప్రస్తుతం వందలాది కాల్స్‌ను నిర్వహిస్తోంది. కెనడాలో మరింతగా విస్తరిస్తోంది.
AIతో బిల్డ్ చేయడం..
జంపాల ChatGPT, Claude వంటి AI కోడింగ్ అసిస్టెంట్లను ఉపయోగించింది. కానీ ఉత్పత్తిని ఒక్కసారిగా బిల్డ్ చేయడానికి వాటిని పూర్తిగా ఆధారం చేసుకోలేదు. చిన్న చిన్న కోడ్ స్నిప్పెట్లు జనరేట్ చేసి, టెస్ట్ చేసి, బగ్స్ స్వయంగా ఫిక్స్ చేసి, బ్యాకెండ్ బిల్డ్ చేసింది. ఇది సాఫ్ట్‌వేర్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడానికి సహాయపడింది.
తదుపరి లక్ష్యం.. AI ఏజెంట్స్
Voxa Agents ద్వారా యూజర్లు సాధారణ ఇంగ్లీష్‌లో టాస్క్ వివరిస్తే ఆటోమేటిక్ AI ఏజెంట్లను సృష్టించవచ్చు. కాంపిటీటర్లను మానిటర్ చేయడం, మీటింగ్ బ్రీఫింగ్స్ సిద్ధం చేయడం, ఆన్‌లైన్ కాన్వర్సేషన్లు ట్రాక్ చేయడం వంటివి చేయగలవు. ఆమె కంపెనీని మరింత విస్తరించి.. ప్రముఖ స్టార్టప్ యాక్సలరేటర్‌లో చేరి.. బిజినెస్‌ను స్కేల్ చేయాలని ఆశిస్తోంది.






