- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖకు జగన్.. షెడ్యూల్ ఖరారు
బంగాళాఖాతం ఒడిశా తీరంలో మత్య్సకారులు గల్లంతైన విషయం తెలిసిందే. అయితే ఈ మత్య్సకారుల కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి పరామరామర్శించాలని నిర్ణయించుకున్నారు. ..

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతం ఒడిశా తీరంలో మత్య్సకారులు గల్లంతైన విషయం తెలిసిందే. అయితే ఈ మత్య్సకారుల కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి పరామర్శించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం విశాఖ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఉదయం గుంటూరు తాడేపల్లి నుంచి విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి బాధితుల ఇంటికెళ్లి పరామర్శించనున్నారు.
కాగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన మత్య్సకారులు కారి చిన్నయ్య, సీతోడు, చిన్నయ్య, అప్పలరాజు, గరగయ్య, చిన్న అమ్మోరు, భీమిలి మండలం నాగమయ్యపాలేనికి చెందిన బండియ్య సముద్రంలో వేటకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో కారి చిన్నయ్య తప్ప ఎవరూ ఒడ్డుకుచేరుకోలేదు. దీంతో మత్య్సకారులందరూ మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. ఇప్పటిరకూ మృతదేహాలు సైతం లభ్యం కాలేదు. దీంతో ఆయా కుటుంబాలకు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని పరామర్శించాలని మాజీ సీఎం జగన్ భావించారు. ఇందులో భాగంగా మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు.






