స్వయంగా రూప రూ. 472 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను ధ్వంసం చేసిన సీఎం

by Malleboina Mahesh |

అసోంలో రూ. 472 కోట్ల విలువైన డ్రగ్స్ ధ్వంసం.. డ్రగ్స్ ప్యాకెట్లపై స్వయంగా రోడ్ రోలర్ నడిపిన సీఎం హిమంత బిశ్వ శర్మ!

స్వయంగా రూప రూ. 472 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను ధ్వంసం చేసిన సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: మాదకద్రవ్యాల (Drugs) నిర్మూలనే లక్ష్యంగా అసోం రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. నల్బారీ జిల్లా దౌలాసాల్‌లోని 14వ అసోం పోలీస్ బెటాలియన్ ఆవరణలో ఆదివారం (జూలై 12, 2026) నిర్వహించిన రాష్ట్ర స్థాయి డ్రగ్స్ ధ్వంసం కార్యక్రమంలో సీఎం హిమంత బిశ్వ శర్మ స్వయంగా పాల్గొన్నారు. వివిధ కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న భారీ డ్రగ్స్ నిల్వలను ధ్వంసం చేసే ప్రక్రియను ఆయన స్వయంగా ప్రారంభించారు.

రూ. 472 కోట్ల డ్రగ్స్ రోడ్ రోలర్‌తో రూపుమాపిన సీఎం

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపి సీజ్ చేసిన సుమారు రూ. 472 కోట్లకు పైగా విలువైన మాదకద్రవ్యాలను ఈ కార్యక్రమం ద్వారా పూర్తిగా నిర్మూలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా రోడ్ రోలర్ (Road Roller) నడుపుతూ డ్రగ్స్ ప్యాకెట్లను తొక్కిస్తూ వాటిని నాశనం చేశారు. అసోంను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా (Drugs-Free State) మార్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మాదకద్రవ్యాల ముఠాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. ఈ వినూత్న ప్రచారానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story