- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వానొస్తే డోర్నకల్ 'నరకద్వారం'.. తవ్విన రోడ్లతో ప్రాణసంకటం!
మున్సిపాలిటీ పరిధిలో నిత్యం ఎదురవుతున్న సమస్యలపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

దిశ, డోర్నకల్ : మున్సిపాలిటీ పరిధిలో నిత్యం ఎదురవుతున్న సమస్యలపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పట్టణాన్ని వరిస్తున్న అభివృద్ధి పనులే ఇప్పుడు ప్రజలకు శాపంగా మారాయి.ప్రభుత్వ ప్రతిష్టాత్మక 'అమృత్ భారత్' పథకం కింద పట్టణంలో తాగునీటి పైపుల ఏర్పాటు కోసం రోడ్లపై భారీగా తవ్వకాలు జరిపారు.అయితే, పైపులు వేసిన అనంతరం సదరు గుంతలను సరిగ్గా పూడ్చకుండా,రోడ్లను పునరుద్ధరించకుండా అలాగే వదిలేయడం వల్ల వాహనదారులు,కాలినడకన వెళ్లేవారు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు.పట్టణంలో మురికి కాలువల(డ్రైనేజీ)నిర్మాణం పనులు కూడా అక్కడక్కడ నిలిచి నత్తనడకన సాగుతున్నాయి.
దీనికి తోడు,రోడ్ల విస్తరణ పనుల పరిస్థితి "మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కు" అన్న చందంగా తయారైందని స్థానికులు మండిపడుతున్నారు.ఎప్పుడు ఏ పనులు మొదలవుతాయో, ఎప్పుడు ఆగిపోతాయో తెలియని అయోమయ స్థితి నెలకొంది.పట్టణంలో పారిశుధ్య నిర్వహణ క్రమంగా మెరుగుపడుతుండటం కొంత ఊరట కలిగిస్తున్నప్పటికీ,ప్రధాన నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యం ఆ సత్ఫలితాలను నీరుగారుస్తోంది. అధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణ లోపంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తుతోంది.వానకాలం ఈగలు, దోమలు విజృంభించి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పట్టణ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి,తవ్విన రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని,పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






