- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినీ నటుడు ఆర్య, నిర్మాతలపై చీటింగ్ కేసు నమోదు
ప్రముఖ తమిళ నటుడు, హీరో ఆర్య పై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదయింది. అతనితోపాటు మినీ స్టూడియో, ది షో పీపుల్ సంస్థలపై కూడా కేసు బుక్కయింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ తమిళ నటుడు, హీరో ఆర్య పై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదయింది. అతనితోపాటు మినీ స్టూడియో, ది షో పీపుల్ సంస్థలపై కూడా కేసు బుక్కయింది. అనంతన్ కాడు అనే సినిమా కోసం రూ.2.12 కోట్ల విలువైన ప్రొడక్షన్ పరికరాలను తీసుకుని కేవలం రూ.42 లక్షలు మాత్రమే చెల్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతన్ కాడు సినిమా నిర్మాణ సమయంలో హీరో ఆర్య, చిత్ర నిర్మాత వినోద్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పలుమార్లు జూబ్లీహిల్స్ వెంకటగిరిలోని హైలాంకాలనీలోని తాహేర్ సినీ టెక్నిక్ సంస్థను సంప్రదించి.. తమకు లేటెస్ట్ డిజిటల్ కెమెరాలు, లైటింగ్ యూనిట్లు, ఇతర నిర్మాణ పరికరాలు కావాలని కోరారు. అందుకు చెల్లించాల్సి అద్దెను పూర్తిగా ఇస్తామని, బకాయిలు ఉండవని హామీ ఇచ్చారు. దీంతో గతేడాది ఫిబ్రవరి 25న అగ్రిమెంట్ చేసుకుని.. హైదరాబాద్ నుంచి కేరళకు పంపారు.
చిత్ర నిర్మాణం పూర్తయ్యేంతవరకూ వస్తువుల్ని వాడుకుని.. ఒప్పందం ప్రకారం రూ.2.12 కోట్లు చెల్లించలేదని, రూ.1.80 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్ లో ఉంచారని సదరు సంస్థ అకౌంటెంట్ జావేద్ అలీ జూబ్లీహిల్స్ పోలీసుల్ని ఆశ్రయించాడు. సినిమా విడుదలకు ముందు నో డ్యూస్ సర్టిఫికెట్ తీసుకుంటామని చెప్పి.. దానిని కూడా నిలబెట్టుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. బకాయిలపై పలుమార్లు లేఖలు రాసినా, వాట్సప్ మెసేజ్ లు పెట్టినా, ఫోన్ కాల్స్ చేసి గుర్తుచేసినా.. స్పందన లేదన్నారు. కేరళ కోర్టును ఆశ్రయించి వాస్తవాలను దాచిపెట్టి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారని వాపోయారు. పైగా బకాయిలను క్లియర్ చేయాలని తమ సంస్థ మేనేజర్ వారిని సంప్రదించగా.. హీరో ఆర్య, నిర్మాత వినోద్, కిశోర్ రివర్స్ లో బెదిరించారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






