- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ ఒక్క పని చేసి.. బోర్ వెల్స్ నింపాడు..
ముంబైకి చెందిన చేతన్ సూరేంజి తక్కువ నీటితో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఇది తనకే కాదు తన పొరుగు ఇళ్లలో బోర్ వెల్స్‌ను కూడా రీఛార్జ్ చేస్తుంది. ఎలాగో చూద్దాం.

దిశ, ఫీచర్స్ : ముంబైకి చెందిన చేతన్ సూరేంజి తక్కువ నీటితో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఇది తనకే కాదు తన పొరుగు ఇళ్లలో బోర్ వెల్స్‌ను కూడా రీఛార్జ్ చేస్తుంది. ఎలాగో చూద్దాం.
ముంబైకి చెందిన చేతన్ సూరేంజి ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం తను నివసిస్తున్న ఏరియాలో మూడు ఇళ్లకు ఒక్క బోర్ వెల్ మాత్రమే ఉండేది. కాలం గడిచేకొద్దీ ఇళ్ల సంఖ్య పెరిగింది. బోర్ వెల్స్ సంఖ్య కూడా పెరిగింది. మొదట బోర్ వెల్ లోతు 30 అడుగులు ఉండేది. తర్వాత 80-100 అడుగుల వరకు పెరిగింది. చేతన్ ఇంటి బోర్ వెల్ కూడా 100 అడుగుల లోతు ఉంది. అయినా సరే వేసవిలో నీటి కొరత ఎదుర్కొన్నాడు. అంతేకాదు బోరువెల్ 30 అడుగుల లోతు ఉన్నప్పుడు నీరు తియ్యగా ఉండేది. కానీ లోతు పెరగడంతో ఉప్పగా మారింది. నీటి నాణ్యత తక్కువగా ఉండటం వల్ల ప్లంబింగ్ తరచుగా దెబ్బతిన్నది. దీంతో దీనికి పరిష్కారం కనిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ సమస్యకు అనేక మార్గాలు ఆలోచించి.. చివరికి వర్షపు నీటి సంరక్షణ, బోర్ వెల్ రీఛార్జింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
గ్రౌండ్ వాటర్ రీఛార్జ్
నీటి ఉప్పుతనాన్ని తగ్గించడం గురించి ఆయన చేసిన పరిశోధనలో వర్షపు నీటి సంరక్షణ ద్వారా గ్రౌండ్ వాటర్ స్థాయిని పెంచవచ్చని తెలిసింది. తన ఇల్లు 50 ఏళ్ల పాతది. కాబట్టి ప్రధాన నిర్మాణానికి పెద్దగా మార్పులు చేయకుండా ఇన్‌స్టాలేషన్ చేయాల్సి వచ్చింది. కొంత ప్రయత్నం తర్వాత.. తన ఇంటి పైకప్పును 30 అడుగుల లోతు బోర్ వెల్‌కు పైపు ద్వారా అనుసంధానం చేశాడు. ఇందువల్ల పైకప్పు నుంచి వచ్చే వర్షపు నీరు నేరుగా బోరువెల్‌లోకి వెళ్తుంది. అంతేకాకుండా.. ఒక పెర్కొలేషన్ పిట్‌ను కూడా నిర్మించాడు. ఇది పైకప్పు నీటిని పిట్‌లో సేకరిస్తుంది. గ్రౌండ్‌వాటర్‌ను రీఛార్జ్ చేస్తుంది. దీంతోపాటు ఎయిర్ కండీషనర్ నుంచి వచ్చే అవుట్‌లెట్ పైపును కూడా ఈ పిట్‌కు అనుసంధానం చేశాడు. వేసవిలో ఇది రోజుకు 25-30 లీటర్ల నీటిని అందిస్తుంది. ఈ నీటిని ఫిల్టర్ చేసి బోర్ వెల్ రీఛార్జ్‌కు ఉపయోగిస్తారు.
సంవత్సరం పొడవునా నీరు
తన ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలానికి రెండు పైపులు అనుసంధానం చేసి.. వర్షపు నీరు డ్రైన్‌లోకి వెళ్లకుండా నేరుగా నేలలోకి వెళ్లేలా చేశాడు చేతన్. తోట నుంచి వచ్చే చాలా నీరు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్‌కు వాడుతారు కాబట్టి రసాయనాలు గ్రౌండ్‌వాటర్‌ను కలుషితం చేయకూడదని.. రసాయనాలు వాడడాన్ని పూర్తిగా నిషేధించాడు. పిట్ ఏర్పాటు తప్ప మిగతా ఇన్‌స్టాలేషన్‌లకు పెద్దగా ఖర్చు లేదు. ఇంట్లో ఇప్పటికే ఉన్న పైపులు, ఫిట్టింగ్స్ వాడి ఈ వ్యవస్థను తయారు చేశాడు. నీటి కొరత కారణంగా 30 అడుగుల పాత బోర్ వెల్ ఉపయోగం లేకుండా పోయిందని.. దీంతో కొత్తది తవ్వామని.. కానీ వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత పాత బోర్ వెల్ కూడా రీఛార్జ్ అయిందని చెప్పాడు. ఇప్పుడు సంవత్సరం పొడవునా నీరు ఉంటుందని తెలిపాడు. నీటి ఉప్పుతనం సమస్య కూడా పరిష్కరించబడిందని అన్నాడు.
పొరుగువారి కూడా లాభమే..
గ్రౌండ్‌వాటర్ రీఛార్జింగ్ తన కుటుంబానికి మాత్రమే కాకుండా పొరుగువారికి కూడా లాభం చేకూర్చింది. వారి రెండు బోరువెల్లులు నిండాయి. తాగునీటికి మాత్రమే మున్సిపాలిటీపై ఆధారపడే వీరు.. మిగతా అన్ని అవసరాలు ఈ రెండు బోర్ వెల్స్ తీరుస్తున్నాయి. అంతేకాకుండా.. చేతన్ చేసిన పని ప్రాంతంలోని సమీప బావులను కూడా రక్షించాయి. రియల్ ఎస్టేట్ అభివృద్ధి వల్ల ఎండిపోయిన ఈ బావులు ఇప్పుడు క్రిస్టల్ క్లియర్ నీటితో కనిపిస్తున్నాయి.






