మునగాలలో పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక..

by Batti.Sumithra |

మునగాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా ఆదివారం పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఘనంగా జరిగింది.

మునగాలలో పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక..
X

దిశ, మునగాల : మునగాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా ఆదివారం పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఘనంగా జరిగింది. సుమారు 26 సంవత్సరాల అనంతరం ఒకే వేదిక పై కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనందం, ఆత్మీయతతో కళ్లలో ఆనందబాష్పాలు మెదిపించారు. 1999- 2000 వ బ్యాచ్‌కు చెందిన మునగాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, పాఠశాలలో గడిపిన మధుర జ్ఞాపకాలను ఒక్కసారి తిరిగి స్మరించుకున్నారు.

అప్పటి గురువులు, స్నేహితులు, తరగతి గదులు, ఆట స్థలాలు అన్నీ గుర్తుచేసుకుంటూ పాత రోజులను మళ్లీ జీవించినట్లయ్యింది. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ జీవితంలో ఎంత దూరం వెళ్లినా పాఠశాల అనుబంధం ఎప్పటికీ మరిచిపోలేనిదని పేర్కొన్నారు. తమను తీర్చిదిద్దిన గురువుల పట్ల కృతజ్ఞతాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ గురువులను సన్మానించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఆనాటి ఉపాధ్యాయులు నిరంజన్ రెడ్డి, దాయనంద్, రామ్మోహన్ రావు, శంకరయ్య, రత్నాచారి, రంగారావు, అనంత రాములు, శ్రీనివాస్ రావు, విద్యార్థులు మాధవరావు, లక్ష్మి నారాయణ, దస్తగిరి, గణేష్, ఉపేందర్, ఎంఆర్సీ, పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story