ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

by Batti.Sumithra |

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని బోధిధర్మ యోగ అండ్ హెల్త్ అసోసియేషన్ అధ్యక్షుడు సీత భాస్కర్ అన్నారు.

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
X

దిశ, భూదాన్ పోచంపల్లి : ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని బోధిధర్మ యోగ అండ్ హెల్త్ అసోసియేషన్ అధ్యక్షుడు సీత భాస్కర్ అన్నారు. ఆదివారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని పద్మశాలి సభా వేదిక వద్ద బోధిధర్మ యోగ అండ్ హెల్త్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజరాజేశ్వరి నర్సింగ్ హోమ్ సహకారంతో ఉచిత ఎముకల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 200 మందికి నడుము నొప్పి, మోకాళ్ల నొప్పి, మెడ నొప్పి, కీళ్ల నొప్పులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం.ఎస్. విశ్వనాథ్, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ప్రదీప్, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కడవేరు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి చింతల రామకృష్ణ, సహాయ కార్యదర్శులు దోర్నాల బాలరత్నం, రణం రాజశేఖర్, కోశాధికారి కొండమడుగు మల్లేష్, సాంస్కృతిక కార్యదర్శి వనం వెంకటేష్, కార్యవర్గ సభ్యులు దోర్నాల బాలరాజు, బావండ్ల రాజు, వీడెం విష్ణు, ఈపూరి ముత్యాలు, కర్నాటి బాలరాజు, సంఘం చంద్రయ్య, రామనాథం, చింతకింది కిరణ్, విష్ణు, కృష్ణకుమార్, నాగరాజు, బిట్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story