- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ రెండో చేతికీ సమస్య ఉంది: సీఎం చంద్రబాబు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండో చేతికి కూడా స్వల్ప సమస్య ఉందని, అసరమైతే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ముంబైలో చేతికి సర్జరీ చేయించుకున్న పవన్ కల్యాణ్ ను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌కు సక్సెస్ ఫుల్‌గా వైద్యులు శస్త్ర చికిత్స చేశారని తెలిపారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండో చేతికి కూడా స్వల్ప సమస్య ఉందని, అసరమైతే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ముంబై కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేతికి సర్జరీ చేయించుకున్న పవన్ కల్యాణ్ ను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌కు సక్సెస్ ఫుల్‌గా వైద్యులు శస్త్ర చికిత్స చేశారని తెలిపారు. పవన్ కల్యాణ్ రెండో చేతికి సమస్య ఉందని, ప్రస్తుతం ఫిజియోథెరపి చేస్తామని వైద్యులు తెలిపారని ఆయన చెప్పారు. అవసరమైతే ఆపరేషన్ చేస్తామన్నారని తెలిపారు. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎక్కువ విశ్రాంతి తీసుకోవాల్సిన పవన్ కల్యాణ్‌కు తాను సూచించినట్లు చెప్పారు. త్వరగా కోలుకుని ప్రజా సేవలో పాల్గొనాలని తాను చెప్పినట్లు చంద్రబాబు పేర్కొన్నారు.






