- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పురుగుల మందు తాగి GHMC డ్రైవర్ మృతి
జిహెచ్ఎంసి డ్రైవర్ ఒకరు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దగోల్కొండ గ్రామంలో జరిగింది.

దిశ, శంషాబాద్: జిహెచ్ఎంసి డ్రైవర్ ఒకరు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దగోల్కొండ గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాగారం గణేష్(46) జిహెచ్ఎంసి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య అమృత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, శనివారం మధ్యాహ్నం మద్యం సేవించి ఇంటికి వచ్చిన ఆయన భార్యతో గొడవపడ్డాడు. అనంతరం రూ.500 తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. కొద్దిసేపటికే పెద్దగోల్కొండ గ్రామ పరిధిలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారు.
ముక్కు, నోటి నుంచి నురగ రావడంతో పాటు పురుగుల మందు వాసన రావడంతో వెంటనే 108 అంబులెన్స్‌లో మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.మృతుడి భార్య అమృత ఫిర్యాదు మేరకు శంషాబాద్ పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.






