- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడిమ్యాలలో కాంగ్రెస్‌లో భారీ చేరికలు
ప్రజలు ప్రభుత్వ పనితీరుపై విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

దిశ, కొడిమ్యాల: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని, ప్రజలు ప్రభుత్వ పనితీరుపై విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఆదివారం కొడిమ్యాల మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో కొండాపురం, నర్సింలపల్లె గ్రామాల ఉపసర్పంచ్‌లు గుండు రాజ్‌కుమార్, నరేష్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రైతు సంక్షేమం, మహిళల అభ్యున్నతి, గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసమే కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున చేరికలకు నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ రాజా నర్సింగరావు, సర్పంచ్ ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం జీవన్ రెడ్డి మండల అధ్యక్షుడు కడారి మల్లేశం. ఏఎంసీ వైస్ చైర్మన్ రాజేష్ పార్టీ,సర్పంచ్ సామంతుల గంగవ్వ పార్టీ అధ్యక్షుడు గోగూరి భూషణ్ రెడ్డి,నాయకులు నారాయణ గౌడ్, కమలాకర్ రెడ్డి,ముత్యం శంకర్ గోల్కొండ రాజు, అజయ్ గౌడ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.






