- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్ట్రెస్,యాంగ్జైటీస్ వేధిస్తున్నాయా..? ఈ వ్యాయామాలు ట్రై చేయండి!
ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం కలిగించి, అధిక రక్తపోటును తగ్గించడంలో బ్రీతింగ్ ఎక్సర్ సైజ్‌లు సహాయపడతాయి.

దిశ, ఫీచర్స్ : స్ట్రెస్, యాంగ్జైటీస్ వేధిస్తున్నాయా? కీళ్లు, ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఎటువంటి ఖర్చులేని, ఎవరైనా ఈజీగా అనుసరించదగ్గ ఓ చక్కటి పరిష్కారం ఉందంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. అదే బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్. ఈ సమస్యలతోపాటు శరీరంలో శక్తిస్థాయిలను పెంచడంలోనూ శ్వాస వ్యాయామాలు కీ రోల్ పోషిస్తాయని చెబుతున్నారు. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
*ఒత్తిడి, ఆందోళన దూరం : శ్వాసను లోతుగా పీల్చడం వదలడం వంటి వ్యాయామాలు మెడిటేషన్, యోగాతో ముడిపడి ఉంటాయి. ఇవి ఒత్తిడి ఆందోళనల స్థాయిలను తగ్గిస్తాయి. పారా సింపథెటిక్ నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేయడం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. శరీరం, మనస్సును సమతుల్యం చేస్తూ, మానసిక ప్రశాంతతను అందించడంలో బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు సమర్థవంతంగా పనిచేస్తాయి.
*అధిక రక్తపోటు తగ్గుతుంది : ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించి అధిక రక్తపోటును తగ్గించడంలో బ్రీతింగ్ ఎక్సర్ సైజ్‌లు సహాయపడతాయి. తద్వారా గుండె ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. హృదయ స్పందన వ్యాధుల రిస్క్‌ను తగ్గిస్తాయి.
*ఊపిరితిత్తులు బలంగా మారుతాయి : బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లతో లంగ్స్ బలంగా మారుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి శ్వాస పీల్చి వదిలే క్రమంలో కండరాలకు మంచి వ్యాయామం జరుగుతుంది. తద్వారా వాటి పనితీరు మెరుగు పడుతుంది. బాడీకి ఆక్సిజన్‌ను సరఫరా చేసే సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. శ్వాసకోశ అనారోగ్యాలను దూరం చేస్తాయి.
*ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది : శ్వాస వ్యాయామాలతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి శరీర కదలికలకు కారణమై, రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. అలాగే రోగ నిరోధక ప్రతి స్పందనలో కీ రోల్ పోషిస్తాయి. ముఖ్యంగా చలి కాలంలో ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల బారి నుంచి రక్షిస్తాయి.
*మెరుగైన జీర్ణ క్రియ : బ్రీతింగ్ వ్యాయామాలు మెరుగైన జీర్ణ క్రియకు సహాయపడతాయి. శ్వాస పీల్చడం, వదలడం వంటి కారణాలతో పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను ప్రేరేపించడంతోపాటు జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. తద్వారా ప్రేగుల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
*కండరాల రిలాక్సేషన్ : శ్వాస వ్యాయామాలు మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాదు, కండరాలకు విశ్రాంతిని ఇస్తాయి. దీర్ఘకాలిక నొప్పులు, కండరాల వాపు, తరచుగా కండరాలు పట్టేయడం వంటి ఇబ్బందులను నివారిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
*క్వాలిటీ స్లీప్ : బ్రీతింగ్ ఎక్సర్ సైజ్‌లు ఒత్తిడిని తగ్గించడం ద్వారా పరోక్షంగా క్వాలిటీ స్లీప్‌ను కూడా మెరుగు పరుస్తాయి. కాబట్టి నిద్ర వేళకు ముందు మెడిటేషన్, యోగా, డీప్ బ్రీతింగ్ వంటివి ప్రాక్టీస్ చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. దీనివల్ల మానసిక ప్రశాంతత చేకూరి అన్ని రకాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






