- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాలో భారతీయ మహిళ దారుణ హత్య
అమెరికాలో భారతీయ మహిళ దారుణ హత్యకు గురయ్యారు. జార్జియాలో గూగుల్ సీనియర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న భారతీయ అమెరికన్ మహిళ శీతల్ వ్రజెసిన్ 57ను ఆమె భర్త కిర్క్ బి. వ్రజెసిన్ తుపాకీతో కాల్చి హాత్య చేశాడు. భార్య భర్తల మధ్య జరిగిన గొడవ కారణంగానే కిర్క్ శీతల్ ను చంపేసినట్టు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో భారతీయ మహిళ దారుణ హత్యకు గురయ్యారు. జార్జియాలో గూగుల్ సీనియర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న భారతీయ అమెరికన్ మహిళ శీతల్ వ్రజెసిన్ 57ను ఆమె భర్త కిర్క్ బి. వ్రజెసిన్ తుపాకీతో కాల్చి హాత్య చేశాడు. భార్య భర్తల మధ్య జరిగిన గొడవ కారణంగానే కిర్క్ శీతల్ ను చంపేసినట్టు తెలుస్తోంది. తల్లిని కాలుస్తుంటే అడ్డుకునేందుకు వచ్చిన కుమారుడు జేసన్పై కూడా నిందితుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అతడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు.
ఇక శీతల్ కు గూగుల్ లో రెండు దశాబ్దాలకు పైగా టెక్నాలజీ రంగంలో అనుంభం ఉందని తెలుస్తోంది. ఆమె రెండు సాఫ్ట్ వేర్ పేటెంట్లకు కూడా ఇన్వెంటర్ గా ఉన్నట్టు సమాచారం. ఇటీవల అమెరికాలో భారతీయులపై దాడులు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. జాతిఅహంకార వ్యాఖ్యలు చేయడంతో పాటు కొందరు దాడులకు సైతం పాల్పడుతున్నారు. భారతీయులపై దాడులు జరిగినట్టు తరచూ ఏదో ఒక వార్త దర్శనం ఇస్తోంది. ఇక ఈ కేసులో కట్టుకున్నవాడే భార్యను హత్య చేయడం షాకింగ్ గా మారింది.






