జడ్చర్లలో ఘనంగా బండి సంజయ్ 55వ జన్మదిన వేడుకలు

by Ratna Kumari |

జడ్చర్లలో కేంద్ర మంత్రి బండి సంజయ్ 55వ జన్మదినాన్ని బీజేపీ నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా జరుపుకున్నారు.

జడ్చర్లలో ఘనంగా బండి సంజయ్ 55వ జన్మదిన వేడుకలు
X

దిశ, జడ్చర్ల : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 55వ జన్మదినోత్సవాన్ని జడ్చర్ల మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సామల నాగరాజు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కేంద్ర మంత్రి బండి సంజయ్ దీర్ఘాయుష్షు కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం కావేరమ్మపేట ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. అదే పాఠశాల ఆవరణలో బండి సంజయ్ పేరుతో మొక్కలు నాటారు. హౌసింగ్ బోర్డు ప్రాంతంలోని ఓల్డ్ ఏజ్ హోంలో వృద్ధులకు బ్లడ్ గ్రూప్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ కూడలిలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సామల నాగరాజు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కృష్ణయ్య, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కొంగలి శ్రీకాంత్, రాష్ట్ర నాయకుడు బోయ బాలకృష్ణ, మధు గౌడ్, రాజశేఖర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనాథ్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, టౌన్ ప్రధాన కార్యదర్శి వెంకట్, కిసాన్ మోర్చా నాయకుడు మురళీకృష్ణ, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, బత్తుల మహేష్, కిట్టు, ప్రశాంత్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, నవీన్, తిరుపతయ్య, గుండు శివకుమార్, రాజేష్ నాయక్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story