SIR ఫారం పేరుతో కొత్త సైబర్ స్కామ్.. ఓటీపీతో జాగ్రత్త!

by Jakkula.Mamatha |

ఓటర్ల జాబితాలో 18 ఏళ్లు పైబడిన వారి పేర్లు చేర్చడం మరియు అక్రమ ఓటర్లను తొలగించేందుకు ఎన్నికల సంఘం ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో సైబర్ మోసగాళ్లు ప్రజలను టార్గెట్ చేస్తున్నట్లు ఈరోజు ఆళ్లపల్లి మండలం వాట్సాప్ గ్రూపులో చక్కర్లు కొడుతున్నాయి.

SIR ఫారం పేరుతో కొత్త సైబర్ స్కామ్.. ఓటీపీతో జాగ్రత్త!
X

దిశ, ఆళ్లపల్లి: ఓటర్ల జాబితాలో 18 ఏళ్లు పైబడిన వారి పేర్లు చేర్చడం మరియు అక్రమ ఓటర్లను తొలగించేందుకు ఎన్నికల సంఘం ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో సైబర్ మోసగాళ్లు ప్రజలను టార్గెట్ చేస్తున్నట్లు ఈరోజు ఆళ్లపల్లి మండలం వాట్సాప్ గ్రూపులో చక్కర్లు కొడుతున్నాయి. SIR ఫారం నింపిన వారికి తెలియని నంబర్ల నుంచి కాల్ చేసి తాము బీఎల్ఓ అని చెప్పుకుని, "2002 ఓటర్ల జాబితాలో పేరు ఉందో లేదో చెక్ చేయడానికి ఓటీపీ చెప్పండి" అని అడుగుతున్నారాని గ్రూపులో ఫార్వర్డ్ చేస్తున్నారు. ఒక్కసారి ఓటీపీ చెప్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుందని, భోపాల్‌లో ఇప్పటికే ఇలాంటి స్కామ్‌లు రిపోర్ట్ అయ్యాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈసీఎల్ లేదా బీఎల్వో ఎవరూ ఫోన్‌లో ఓటీపీ బ్యాంక్ వివరాలు అడగరని, తెలియని లింక్‌లు సర్ యాప్ కి" క్లిక్ చేయవద్దని, అనుమానం వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సోషల్ మీడియా గ్రూపులలో పోస్ట్ చేస్తున్నారు.

Next Story